బోధన్ ఘనచరిత్ర

బోధన్ తెలంగాణ రాష్ట్రములోని నిజమాబాద్ కి చెందిన ఒక పట్టణం బోధన్ నిజమాబాద్ జిల్లాలో ప్రసిద్ధి అయినా పారిశ్రామిక పట్టణం వివిధ రకమయిన పంటలు సమృద్ధిగా పండే ప్రాంతాన్ని పూర్వము బహుధాన్యపురి అని పిలిచేవారు కాల క్రమేణ అది బోధన్ గా మారి స్థిరపడింది.
దక్షిణ మధ్య రైల్వే యొక్క నిజామాబాద్ బోధన్ ఇక్కడే అంతం అవుతుంది. బోధన్ ని మూడు ప్రాంతాలుగా విభజించారు. 1.బోధన్ 2.రాకాసిపేట్ 3.శక్కర్ నగర్ ఒకప్పూడు ఆసియ దేశంలోనే పెద్దదిగా ఉండే నిజాం షుగర్ ఫ్యాక్టరీ శక్కర్ నగర్ లోనే ఉంది. బోధన్ తెలుగు వారి అతి ప్రాచీన నగరాల్లో ఒకటి . క్రీ.పూ 6వ శతాబ్దం నాటికీ భారతదేశం లో ఉన్న 16 జాన పదాలలో ఒకటి అస్మక ఒకటి దీని రాజధాని బోధన. 2600 ఏళ్ళ క్రితమే బోధన్ ఒక మహానగరంగా ఉండేనట ఆ కాలం నాటికే అది ప్రసిద్ధి చెందిఉంది అంటే అది అప్పటికే ఉనికిలో ఉంది అన్నమాట దాని నిర్మాణానికి మహానగరంగా చెందడానికి దానికి ఎంత దీర్ఘకాలం పట్టిందో ఊహించవచ్చు. అప్పటికి ఎంతో ముందు జీవించాడు అని భావిస్తున్న బాహుబలికి అది రాజధాని గా ఉండవచ్చు. బోధన్ ప్రాంతం లో దొరికిన అనేక జైన మాత విగ్రహాలు అది ఒక జైన కేంద్రంగా వెలసిందిగా వాస్తవం చెప్తుంది. మౌర్యుల కాలంలో వచ్చిన గ్రీకు దేశస్తుడు మోగాస్టారిసు ఆంధ్రులు చుట్టూ గోడలు ఉన్న 30 మహానగరాల్లో నివసించారు అని ఇండికా గ్రంధంలో రాశాడు. బోధన్ చారిత్రక పట్టణం. బోధన్ ఏకచక్రపురం, బహుధాన్యపురం, బాహుదానపురం,పోధన అని వివిధ రకాలలో వివిధ పేరులతో పిలువబడింది.1056 కి చెందిన శిలాశాసనం ఇక్కడ రాష్ట్రకూట రాజు మూడవ ఇంద్రుడు కట్టించిన వైష్ణవ ఆలయాన్ని ప్రస్తావిస్తుంది. పాండవుల కాలంలో బోధన్ ఏకచక్రపురంగా పిలవడం జరిగింది బోధనలోని రాకాసిపేట భీముడి గుడికి ప్రసిద్ధి. దీనినే స్థానికులు భీమినిగుట్టగా పిలుస్తారు. ఇకా చరిత్రలోకి వెళితే ఈ ప్రాంతంలోనే భీముడు బకరసుడిని వధించాడు అని అంటారు. దీని ఆనవాళ్లు ఇప్పటికి చూడవచ్చు. చరిత్ర యుగం తెలంగాణలో బౌద్ధ యుగంతో ప్రారంభం అయింది. బోధన్ శాతవాహనులు ముందే శుంగాకనువులకు ప్రసిద్ధి చెందినది. ఇది అస్మక దేశంలోని ప్రధానపట్టణలో ఒకటి ఇక్కడి నుండి తెలంగాణ అంతటా బౌద్ధం వ్యాప్తి చెందింది. బోధన్లో భవరి అనే విద్వంసుడు ఇక్కడ ఉండేవాడు . బుద్దిని కర్ణకారిక విని బుద్దిని సత్యం మార్గం నచ్చడంతో అతని శిష్యులతో కలిసి అక్కడికివెళ్లి కొన్ని రోజులు అతని సన్నిధానంలో ఉంది తిరిగి వచ్చాడు. అప్పుడు భవరి పండితుడు ప్రజలోకి ప్రచారం చేశాడు. బోధన్ పట్టణం తరువాత జైన మతానికి కూడా నిలయం అయ్యింది. ఇక్కడి నుంచే జైనం కొలనుపాక అను ప్రాంతాలకు వ్యాపించింది. బోధన్ లో గొప్ప గోమటేశ్వర విగ్రహం వెలసింది అని అంటుంటారు.ఎంతో ఘనచరిత్ర కల్గిన బోధన్ నీ పరిపాలించిన రాజులలో వదియార్గులు ముక్యులు వీరు వాసుం రాజుకి సామంతులుగా పరిపాలన సాగించారు. అని తెలుస్తుంది. కర్ణాటకలోని కూర్గ్ అనే ప్రాంతీయులైన వీరు లింగాయతె సమాజానికి చెందినవారు.
BELAL TALAB వీరి పరిపాలన కాలంలోనే స్థానిక బెలాల్ చెరువు నిర్మాణంజరిగింది. అలాగే దైవభక్తి నిండుగా కలిగిన వీరి వంశసుగా అయినా విశ్వపరుడు అయినా రాజు తన వంటశాలలో రేణుక మాత విగ్రహాన్ని ప్రతిష్టించాడు అని వీరి వంశస్థులు చెప్తారు. విశ్వాపాలుడిచే స్థాపించబడింది కనుక అమ్మవారిని విశ్వపరిని అని అంతుంటరు.పూర్వకాలం ఎంతో వైభోపేతంగా వెలిసిన వీరి పురాతన గృహం నేడు శితిలావస్థకు చేరుకుంది.
ఒకప్పుడు ఆసియఖండం లో పెద్దదిగా పేరు పొందిన నిజాంషుగర్ ఫ్యాక్టరీని 1992 లో అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం నష్టాలు వస్తున్నాయి. అని డెల్టా ఫ్యాక్టరీ మిల్ కి విక్రయించారు. ఈ విక్రయాన్ని స్థానికులు , కార్మికులు వ్యతిరేకించిన అప్పటికి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.ఈ విషయం పై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన శాసనసభ సంగం కుద ఫ్యాక్టరీని తిరిగి ప్రభుత్వ పరం చేయాలిఅని సిఫారసు చేసింది దీనిని కొనుగోలు చేసిన వ్ వి.వి.ఆర్. కృష్ణంరాజు అనే మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ ని నియమించింది. మూడున్నరఏళ్ళ పాటు అయన వివాదాన్ని తీవ్రంగా పరీక్షించారు. అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయి అయినా రాజీనామా చేసిన తర్వాత అక్కడ వాతావరణం సమస్యలు తలెత్తాయి. ఒకప్పుడు ఆరు( 6 ) లక్షల టన్నుల చెరుకు క్రషింగ్ చేసిన ఫ్యాక్టరీ 2009 సీజన్ లో కేవలం 60 వేల టన్నులకు క్రష్ చేయడం జరిగింది. ఇది అంది బోధన్ ఘనచరిత్ర.

Post a Comment

Don't post spam links

Previous Post Next Post